Nag Ashwin: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్కి డైరెక్టర్ 4 d ago

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ కుటుంబంతో కలిసి వచ్చారు. టీటీడీ అధికారులు వారిని ఘనంగా స్వాగతించారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం, అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు డైరెక్టర్‌ను చూసి సెల్ఫీలు దిగేందుకు తరలివచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు 'కల్కి 2898 ఏడీ' పార్ట్-2 అప్డేట్ గురించి అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' పార్ట్-2 గురించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని నాగ్ అశ్విన్ తెలిపారు.